Surprise Me!

కమాండ్ కంట్రోల్​ సెంటర్​ను సందర్శించిన సుందరీమణులు

2025-05-18 55 Dailymotion

Miss World Contestants At Tgiccc : హైదరాబాద్‌ ఆతిథ్యానికి ప్రపంచ సుందరీమణులు ఫిదా అవుతున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటిని చుట్టేస్తున్న మిస్‌వరల్డ్‌ పోటీదారులు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించారు. రెడ్‌ కార్పెట్‌పై దిగిన ముద్దుగుమ్మలకు శునకాలు పుష్పగుచ్చంతో స్వాగతం పలికాయి. అందంగా ముస్తాబైన శునకాలను చూసి మురిసిపోయిన సుందరాంగులు వాటిని వారి సెల్‌ఫోన్‌లలో బంధించుకున్నారు. భాగ్యనగర శాంతి భద్రత పరిరక్షణకు కేంద్ర బిందువుగా ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఆసక్తిగా పరిశీలించారు. ఒక్కో విభాగ పనితీరును అధికారులు వివరించారు. అత్యాధునిక సాంకేతికత వాడుతూ శాంతి భద్రతలు కాపాడుతున్న తీరుపై హర్షం వ్యక్తం చేశారు.

Buy Now on CodeCanyon