AP LIQUOR SCAM UPDATES: జగన్ అధికార అండతో కోట్లు దండుకున్న వైఎస్సార్సీపీ మద్యం మాఫియా సిండికేట్లు కిలోల కొద్దీ బంగారాన్ని కొని మేటలు వేసుకున్నారు. డిస్టిలరీలు, మద్యం సరఫరాదారుల నుంచి వందల కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా గుంజుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు భారీ ఎత్తున బంగారం కొన్నట్లుగా చూపించి బంగారం వ్యాపారులకు కమీషన్లు చెల్లించి వారి ద్వారా ముడుపుల డబ్బును మద్యం మాఫియాకు చేరవేశాయని వెల్లడైంది. చివరకు ఆ బంగారం, డబ్బు ‘అంతిమ లబ్ధిదారుల’ ప్యాలెస్‌కు చేరినట్లు తెలుస్తోంది.
