Tata Group Chairman in TTD : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో టాటా గ్రూప్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్, మాజీ మంత్రి రోజా, నటి రవళి, నటులు ఆది, అశ్విన్, సంగీత దర్శకులు తమన్లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వీరు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.