Miss World 2025 Finale : 20 రోజులుగా అలరించిన ప్రపంచ స్థాయి పండుగ మిస్‌వరల్డ్ అందాల పోటీలు ఆఖరి ఘట్టానికి చేరాయి. మరికొన్ని గంటల్లో తుది విజేత ఎవరో తేలనుంది. ప్రపంచసుందరి గ్రాండ్ ఫినాలే కోసం యంత్రాంగం ఘనమైన ఏర్పాట్లు చేసింది. ఇవాళ(శనివారం) సాయంత్రం ప్రారంభం కానున్న పోటీల్లో బాలీవుడ్ తారలు, మాజీ మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు సందడి చేయనున్నారు.<br /><br />మిస్‌వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు ఘనంగా ఏర్పాట్లు : ప్రపంచ దేశాల సుందరీమణులను ఒక్కచోటుకు చేరుస్తూ అద్భుతంగా సాగుతున్న మిస్ వరల్డ్ పోటీలు చివరి దశకు చేరాయి. అందాల పోటీలకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిన రేవంత్ సర్కార్ పర్యాటకానికి ప్రాచుర్యం కల్పించేలా ముద్దుగుమ్మలను రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడి విశేషాలు వివరించింది. ఈనెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వైభంగా ప్రారంభమైన72వ మిస్ వరల్డ్ పోటీలు నేటి(శనివారం)తో ముగియనున్నాయి. మొత్తం 108 దేశాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు హైటెక్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.