Kommineni Arrest - ఏపీ రాజకీయాలు పూర్తిగా ఇప్పుడు మీడియా చుట్టూ తిరుగుతున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడం రాజకీయ, ఆయనకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ అరెస్టుపై మీడియా వర్గాల నుంచి పెద్దగా సానుభూతి లభించకపోగా, ఆయన జర్నలిజం నైతికతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొమ్మినేని అరెస్టుకు ప్రధాన కారణం, అమరావతి అంశంపై జరిగిన డిబేట్‌లో అతిథిగా హాజరైన కృష్ణంరాజు చేసిన మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు. కృష్ణంరాజు "అమరావతిలో వ్యభిచారం" వంటి వ్యాఖ్యలు చేసినప్పుడు, కొమ్మినేని వాటిని అడ్డుకోకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ ఛానెల్ మినహా ఏ ఇతర మీడియా సంస్థలూ కొమ్మినేనికి మద్దతు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే జర్నలిజం నైతికతపై ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

Kommineni Arrest - Andhra Pradesh politics have now become deeply entangled with media controversies. The arrest of senior journalist Kommineni Srinivasa Rao by AP police and his 14-day judicial remand by the Mangalagiri court has created a major stir within media circles.

#kommineniSrinivasaRao
#KommineniaboutAmaravati
#KSRLiveShow
#Amaravati
#SakshiTv
#YSJagan
#AmaravatiWomen
#Amaravatifarmers