<p>SAAP Chairman About Yoga Day Arrangement in visakha : విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని యోగాంధ్ర ప్రదేశ్‌గా మార్చడమే లక్ష్యంగా ఇక్కడ యోగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. విశాఖ సాగర తీరంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 21న ఉదయం 5 లక్షల మంది యోగాసనాలు వేయనున్నారు. దీని కోసం విశాఖ బీచ్ పరిసరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర-2025కు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. </p><p>ప్రపంచ రికార్డు సృష్టించేలా సాగరతీరంలో లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి వేదికల పనులు చకచకా సాగుతున్నాయి. విశాఖలో జరుగుతున్న యోగా కార్యక్రమానికి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. యోగా కార్యక్రమంలో క్రీడాకారులు భాగస్వాములు అవుతారంటున్న శాప్ ఛైర్మన్ రవి నాయుడుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. </p>