Surprise Me!

విశాఖలో ఘనంగా యోగా దినోత్సవం - డ్రోన్ విజువల్స్

2025-06-21 25 Dailymotion

<p>Visakha International Yoga Day Drone visuals: అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ విశాఖ సాగరతీరం జనసంద్రంగా మారింది. తెల్లవారుజామునుంచే ప్రజల రాకతో ఆర్కే బీచ్‌ సముద్రం ఉప్పెన పొంగిందా అన్నట్లు మారింది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ వేదికైంది. యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. యోగా డేలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, లోకేశ్​ సహా మంత్రులు పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్రమంత్రులు జాదవ్‌ ప్రతాప్‌రావు, రామ్మోహన్‌, శ్రీనివాస్‌ వర్మ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. </p><p>విశాఖ ఆర్కే బీచ్‌ నుంచి భోగాపురం వరకు యోగాసనాలు వేస్తూ 'యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌ - వన్‌ హెల్త్‌' నినాదాలు చేశారు. విశాఖ యోగా డేకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు వచ్చారు. ఉదయం నాలుగు గంటల నుంచే యోగాంధ్ర కార్యక్రమానికి ఉత్సాహంగా పాల్గొన్నారు. సూరత్‌లో 1,47952 మందితో చేసిన యోగా రికార్డును విశాఖ అధిగమించింది. ప్రాంగణంలో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేసుకున్న వారినే అధికారులు లెక్కిస్తున్నారు. రెండు గిన్నిస్‌ బుక్‌ రికార్డులు లక్ష్యంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ రికార్డు సృష్టించేలా ఐదు లక్షల మందితో యోగాసనాలు వేస్తున్నారు. యోగాంధ్రలో మొత్తం 22 వరల్డ్‌ బుక్‌ రికార్డుల కోసం కృషి చేస్తున్నారు. </p>

Buy Now on CodeCanyon