Pulivendula : వైఎస్సార్ కి పులివెందుల కంచుకోట అని అంటారు. అది ఊరికే ఏమీ సాధ్యపడలేదు. ఆయన మూడున్నర దశాబ్దాల రెక్కల కష్టంతోనే ఆ కంచుకోట నిర్మితం అయింది అని అంటారు. ఇక వైఎస్సార్ ఊర్లో లేని సమయంలో అంతా తాను అయి తమ్ముడు వివేకానందరెడ్డి మొత్తం చూసేవారు జనాలను వెంటబెట్టుకుని మరీ ఆఫీసులకు వెళ్ళి సమస్యలు పరిష్కరించేవారు. ఆయన వద్ద ఎలాంటి భేషజాలు ఉండేవి కావని చెబుతారు. సామాన్యుడిగా ఉంటూ ప్రజలతో తాను అన్నట్లుగా వివేకా వ్యవహరించిన తీరుతోనే పులివెందుల వైయస్సార్ ఫ్యామిలీకి అలా కట్టుబడి పోయింది. కానీ ఈరోజు ఫలితాలు వైసీపీకి ఓ గుణ పాఠం మాత్రమే. ఈ రోజుకీ వైఎస్సార్ కుటుంబం పట్ల పులివెందుల జనంలో అభిమానం ఉంది. కానీ దానిని ఇంతకు ఇంతా పెంచుకొని పదిలపరచుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఆ దిశగా వైసీపీ చేసే ప్రయత్నాలే ఆ పార్టీకి శ్రీరామ రక్షగా మారుతాయని అంటున్నారు. నాటి వైఎస్ఆర్- వివేకానంద రెడ్డి మాదిరి.. నేడు జగన్- అవినాష్ పులివెందులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరో 10 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మరింత జాగ్రత్తగా పార్టీని ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలిని నమ్ముకున్న కార్యకర్తను కాపాడుకోవాలి.

Pulivendula, long known as YSR’s fortress, was not built overnight — it took three and a half decades of his dedication and hard work. When YSR was away, his brother Vivekananda Reddy stepped in, personally helping locals resolve their issues, always remaining humble and approachable. This deep connection cemented Pulivendula’s loyalty to the YSR family.

But the latest election results are a wake-up call for the YSRCP. While the people still hold affection for the family, that trust needs to be protected and strengthened. Just like YSR and Viveka safeguarded Pulivendula in the past, Jagan and Avinash must take the lead today.

With local body elections just 10 months away, the party must focus on retaining its core workers and preserving the YSR family’s stronghold.

📍 Location: Pulivendula, Andhra Pradesh
📅 Timeline: August 2025 & upcoming 2026 local body elections

#Pulivendula #YSRCP #JaganMohanReddy #YSRLegacy #VivekanandaReddy #AndhraPolitics #PoliticalNews #YSRFamily #PulivendulaPolitics #APPolitics #BreakingNews #Elections2025 #LocalBodyElections #PoliticalAnalysis

Also Read

పులివెందుల ఫలితం, మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandra-babu-made-interesting-comments-with-ministers-over-pulivenudla-result-447855.html?ref=DMDesc

పులివెందులలో టీడీపీ గెలుపుతో నెక్స్ట్ ఇక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ycp-leader-perni-nani-interesting-analysis-over-pulivendula-zptc-results-447845.html?ref=DMDesc

పులివెందుల ఎన్నికల్లో టీడీపీ విజయంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-victory-pulivendula-zptc-election-balakrishna-btech-ravi-and-ministers-shocking-response-447835.html?ref=DMDesc