Surprise Me!

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - ఆనందంలో మహిళలు

2025-08-25 33 Dailymotion

<p>Smart Ration Cards Distribution In Vijayawada: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఏటీఎం కార్డు తరహాలో సరికొత్త స్మార్ట్ రేషన్​ కార్డులను రూపొందించింది. ఈ కార్డుపై నేతల ఫొటోలు ఎక్కడ కూడా కనిపించవు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ లోగోలతో హుందాగా కనిపించే సరికొత్త కార్డులు పేదల చేతుల్లోకి చేరాయి. ఇంటింటికీ వెళ్లి అధికారులు రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించారు. చౌకబియ్యాన్ని పక్కదారి పట్టించే నాటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. క్యూఆర్​ కోడ్​తో పని చేసేలా ప్రత్యేక టెక్నాలజీతో తయారు చేశారు. డీలర్ల వద్ద నుంచే ఈ పోస్​ యంత్రాలను సైతం ఆధునీకరించారు. స్కాన్ చేసి, ఐరిష్​​, వేలిముద్ర ఆధారంగా రేషన్ తీసుకోగానే క్షణాల్లో ఆ సమాచారాన్ని కేంద్ర డ్యాష్​ బోర్డుకు అందించే ఏర్పాట్లు చేశారు. మన సెల్​ఫోన్​లోని స్కానర్​తో స్కాన్​ చేస్తే చాలు. సులభంగా వివరాలు అన్ని మనమే తెలుసుకోవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఈ స్మార్ట్ రేషన్​ కార్డులు, ఏర్పాట్ల పట్ల విజయవాడ లక్ష్మీనగర్​ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. </p>

Buy Now on CodeCanyon