Janasena : కూటమి ప్రభుత్వంలోని కీలక భాగస్వామి జనసేన అధికారంలోకి వచ్చిన తొలిసారి భారీ కార్యక్రమం నిర్వహిస్తోంది. పార్టీ ఆవిర్భవించిన తర్వాత పదేళ్లకు అధికారంలోకి వచ్చిన జనసేన.. సుమారు 14 నెలల పాలన తర్వాత ప్రజలు, కార్యకర్తలు మనోగతాన్ని తెలుసుకునేందుకు మూడు రోజులపాటు పార్టీ సమావేశాల నిర్వహణకు సమాయుత్తమైంది. గురువారం నుంచి శనివారం సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమం జనసేన భవిష్యత్తు ప్రయాణంపై దిశానిర్దేశం చేస్తుందని అంటున్నారు. ఈ మూడు రోజుల పాటు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ నేతలు, కార్యకర్తలతోనే గడుపుతారని జనసేన ప్రకటించింది. ‘సేనతో సేనాని’ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశాఖ వేదిక అయింది. విశాఖ బీచ్ రోడ్డులోని VMCA హాలుతో పాటు, మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక 30న ఇందిరా గాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. దీంతో ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమం జనసేనకు కొత్త ఊపు తీసుకువస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత పార్టీ కార్యకర్తలు, నేతలతో తొలిసారి అధినేత ముచ్చటించనుండటం ఆసక్తికరంగా మారింది. కార్యకర్తల మధ్య సమన్వయానికి కూటమి పెద్దలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఫలితాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. దీంతో ఈ సమస్యలకు ‘సేనతో సేనాని’ పరిష్కారం చూపుతుందా? లేదా? అన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది.

For the first time since coming to power, coalition partner Janasena is organizing a massive 3-day event titled “Senatho Senani” in Visakhapatnam.

👉 Highlights of the Program:

After 10 years of its formation, Janasena entered power and completed 14 months of governance.

To understand the opinions of people, leaders, and cadres, the party is hosting 3 days of meetings from Thursday to Saturday.

Party chief & Deputy CM Pawan Kalyan will spend these three days exclusively with Janasena leaders and workers.

Venues: VMCA Hall, Municipal Stadium, and Vizag Beach Road.

The program will conclude with a massive public meeting at Indira Gandhi Priyadarshini Stadium on 30th at 6 PM, where Pawan Kalyan will address the crowd.

Party leaders believe this event will bring a new momentum to Janasena’s political journey. With internal coordination challenges in the coalition, all eyes are on whether “Senatho Senani” will bring a solution.

#Janasena #PawanKalyan #SenathoSenani #JanasenaVizagMeeting #APDeputyCM #PawanPublicMeeting #JanasenaPower #TDPJansena #PawanKalyanSpeech #OneindiaTelugu #oneindia #OIUpdates

Also Read

ఆ లెక్క మార్చగలరా లేదా ? సేనకు సేనాని ఏం చెప్పబోతున్నారు ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/can-pawan-kalyan-bridge-cadre-gap-with-sena-tho-senani-meeting-in-vizag-449445.html?ref=DMDesc

విశాఖ కేంద్రంగా పవన్ బిగ్ స్కెచ్ ? ఆ రిపోర్ట్స్ తో అలర్ట్..! "సేనతో సేనాని వెనుక" ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-crafts-roadmap-to-strengthen-jana-sena-at-vizag-gathering-449035.html?ref=DMDesc

శ్రీశైలం అడవిలో దాడి కేసులో ట్విస్ట్..! పవన్ కు పోలీసుల షాక్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-twist-in-srisailam-forest-officials-assault-case-jana-sena-leader-named-a1-tdp-mla-a2-448789.html?ref=DMDesc

~PR.358~ED.232~HT.286~CA.43~