కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సీబీఐకి కేసు అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది. ఆదివారం శాసనసభలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ భాగస్వామ్యమై ఉన్నాయని.. అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్నవారిని శిక్షించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టులో అక్రమాలపై ఇప్పటివరకు నివేదికలు ఇచ్చిన ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్, కాగ్, జస్టిస్ ఘోష్ కమిషన్... గత ప్రభుత్వాన్ని, నాటి ప్రభుత్వ పెద్దల్ని తప్పుపట్టాయన్నారు. తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని, అందుకే శషభిషలకు తావు లేకుండా కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి దాటాకా సాగిన సభ సీఎం ప్రకటన అనంతరం నిరవధికంగా వాయిదా పడింది.

The Telangana Legislative Assembly has officially decided to hand over the Kaleshwaram project scam case to the CBI for a thorough investigation. CM Revanth Reddy announced this decision after discussions on the Justice P.C. Ghose Commission’s report, which highlighted irregularities in the project.

The CM stressed that since multiple interstate and central agencies were involved, only the CBI could carry out a fair and transparent investigation. He also said that those responsible for corruption and misuse of funds in the Kaleshwaram project must be punished.

Watch this video for complete details on the Kaleshwaram CBI probe, political developments, and Assembly updates from Telangana.

#TelanganaAssembly2025 #Telangana #Kaleshwaram #CBI #RevanthReddy #BRS #TelanganaPolitics #BreakingNews #LegislativeAssembly #PoliticalNews #KaleshwaramScam

~HT.286~PR.358~CA.240~