YS Raja Reddy : ప్రస్తుతం షర్మిల.. కాంగ్రెస్ హైకమాండ్ సూచనలతో ఏపీలో పార్టీని పునరుద్ధరించడానికి ముందుకు సాగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే వైఎస్ కుటుంబంలో నాలుగో తరం నుంచి రాజకీయ ఎంట్రీ జరగబోతుంది. దీనిపై షర్మిల అధికారికంగా ప్రకటన చేశారు. వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని తేల్చిచెప్పారు. సమయం వచ్చినప్పుడు తన కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెడతారని క్లారిటీ ఇచ్చేశారు షర్మిల. కర్నూలు ఉల్లి మార్కెట్‌లో షర్మిలతో కలిసి రాజారెడ్డి పర్యటించడం చర్చనీయాంశమైంది.

1996 డిసెంబర్‌లో జన్మించిన రాజారెడ్డి, హైదరాబాద్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి, అమెరికాలోని డాలస్ యూనివర్శిటీలో బిజినెస్ డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలో ఉద్యోగం చేసిన అనుభవం కూడా ఉంది. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన ఆయన.. వ్యాయామం పట్ల కూడా ఆసక్తి కనబరుస్తారు. గతేడాది అట్లూరి ప్రియతో రాజస్థాన్‌లో ఘనంగా వివాహం జరిగింది. ఇక ఇప్పుడు మొత్తం మీద వైఎస్ కుటుంబంలో మరో వారసుడు రాజకీయాల్లోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.

Big news from Andhra Pradesh politics!

YS Sharmila has officially confirmed that her son YS Rajareddy will be entering politics, marking the fourth generation of the YSR family in public life.

Rajareddy, who studied in Hyderabad and the USA, worked abroad and has now returned to join public service. His recent appearance with Sharmila at the Kurnool chilli market has already sparked discussions.

This entry is expected to create new waves in Andhra Pradesh’s political scenario. Stay tuned for more updates!

#YSRajareddy #YSSharmila #YSRajareddyPoliticalEntry #YSRFamily #Sharmila #YSJagan

Also Read

పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయిన " వైఎస్ఆర్ మనవడు ".. విజయమ్మ ఆశీర్వాదం ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-sharmila-son-rajareddy-political-entry-by-taking-vijayamma-blessings-451059.html?ref=DMDesc

ఘనంగా షర్మిల కుమారుడు రాజా రెడ్డి-ప్రియ వివాహ వేడుకలు: జగన్ దూరం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-sharmilas-son-raja-reddy-wedding-celebrations-in-jodhpur-375547.html?ref=DMDesc

కాసేపట్లో చంద్రబాబు ఇంటికి షర్మిల- దశాబ్దాల వైరంలో బిగ్ టర్న్! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/congress-leader-ys-sharmila-to-invite-tdp-chief-chandrababu-today-for-her-son-marriage-371075.html?ref=DMDesc

~PR.358~CA.240~ED.232~HT.286~