Surprise Me!

ఉప్పొంగుతున్న గోదావరి - ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

2025-09-30 16 Dailymotion

<p>Godavari Water Level Rising At Bhadrachalam: గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. అఖండ గోదావరి తీరం రాజమహేంద్రవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ పోటెత్తి ప్రవహిస్తోంది. నిన్న కాస్త తగ్గి స్థిరంగా ప్రవహించిన వరద మళ్లీ పెరిగింది. ధవలేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 12.1 అడుగులకు చేరింది. సుమారు 10 లక్షల 25 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం నుంచి భారీగా వరద ప్రవాహం దిగువకు తరలి వస్తుండటంతో కోనసీమలో వశిష్ట, వైనతేయ, గౌతమీ గోదావరి పాయలు ప్రమాదకరంగా మారాయి. లంక గ్రామాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. మరపడవల్లో లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. పి. గన్నవరం మండలంలోని వశిష్ట వైనతేయ తీరమంతా ప్రమాదకరంగా మారింది. సాయంత్రానికి వరద ప్రవాహం రాజమహేంద్రవరం వద్ద మరింత పెరగనుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం సూచనలు జారీ చేసింది. గోదావరి వరద ఉద్ధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు.</p>

Buy Now on CodeCanyon