Surprise Me!

18 అడుగుల భారీ కొండచిలువ- హడలిపోయిన గ్రామస్థులు

2025-10-28 182 Dailymotion

<p>Forest Officer Catch Huge Python : సాధారణంగా మన గ్రామాల్లో ఆరు లేదా పది అడుగుల పాములను చూసి హడలిపోతుంటాం. అయితే ఉత్తరాఖండ్​, నైనిటాల్​ జిల్లాలోని హెంపుర్​ డిపో ప్రాంతంలో 18 అడుగుల పొడవు, 175 కిలోల బరువున్న భారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూసి ఆ గ్రామస్థులంతా ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో స్థానికులు వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు స్నేక్ క్యాచర్ తాలిబ్ హుస్సెన్​ అనే వ్యక్తిని పిలిపించారు. తాలిబ్​ చాలా చాకచక్యంగా ఆ భారీ కొండచిలువను పట్టుకున్నారు. తరువాత అతను దానిని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. కాగా, ఈ తరహా పాములు కనిపించడం చాలా అరుదని తాలిబ్ తెలిపారు. అయితే ఇవి మనుషులకు ఎటువంటి హాని చేయవని అటవీశాఖ అధికారులు చెప్పారు. ఏదైనా వన్యప్రాణి కనిపిస్తే దానికి హాని చేయకూడదని, వెంటనే తమకు సమాచారం అందించాలని గ్రామస్థులకు అటవీశాఖ అధికారులు పిలుపునిచ్చారు.</p>

Buy Now on CodeCanyon