Surprise Me!

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్‌ వ్యూ

2025-11-14 0 Dailymotion

<p>CM Chandrababu Aerial View of Cyclone Affected Areas : మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. హెలికాప్టర్‌లో ఏరియల్‌ వ్యూ నిర్వహించిన చంద్రబాబు, కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో తుపాను బాధితులతో మాట్లాడారు. సహాయ పునరావాస కేంద్రానికి వెళ్లిన సీఎం చంద్రబాబు తుపాను బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుమార్గంలో ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంటపొలాలను పరిశీలించారు. ఇప్పటికే మొంథా తుపాను (Montha Cyclone) ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులు అందించాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. తుపాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు సూచనలు చేశారు. సమర్థంగా వ్యవహరించి నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.</p>

Buy Now on CodeCanyon