Surprise Me!

క్వాంటమ్​ టెక్నాలజీలో యువతకు శిక్షణ, ఉద్యోగావకాశాలు: యువ పారిశ్రామికవేత్తలు నిఖిల్‌, పృథ్వీ

2025-11-21 6 Dailymotion

<p>Yuva Story on Young Entrepreneurs From Vijayawada:  క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో వేగవంతమైన గ్లోబల్ డిమాండ్‌తో యువ పారిశ్రామికవేత్తల నూతన స్టార్టప్‌ల ద్వారా యువతకు ఆకర్షణీయ ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం పుస్తకాల్లోనే కనిపించిన ఈ సాంకేతికత, ఇప్పుడు కలల పరిశ్రమగా మారింది. వేలాది యువకులకు శిక్షణ, ఉద్యోగాల్లో కొత్త ఆశలు నింపుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం, మార్కెట్ అవసరాలు, రీసెర్చ్ హబ్‌ల పెరుగుదలతో యువతకు ఉపాధి అవకాశాలు సమృద్ధిగా వస్తాయంటోన్న యువ పారిశ్రామికవేత్తలు నిఖిల్ ఆరిమిల్లి, పృథ్వీల గురించి తెలుసుకుందాం.  </p><p>ప్రస్తుతం ప్రపంచంలో నూతన సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుందని యువ పారిశ్రామికవేత్త నిఖిల్‌, పృథ్వీ అన్నారు. సాధారణ కంప్యూటర్స్​లో అయితే కొన్ని కార్యకలాపాలు మాత్రమే చేయగలుగుతాయని అయితే  ఈ క్వాంటమ్​లో సాఫ్ట్​వేర్ ద్వారా పనులను త్వరితగతిన పూర్తి చేయొచ్చని ఆయన స్పష్టం చేశారు. మేము అభివృద్ధి చేసిన క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా యువతకు శిక్షణను ఇస్తామని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా వారి శిక్షణా కాలం ముగిసిన తర్వాత సర్టిఫికెట్​లను అందించి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని యువ పారిశ్రామికవేత్తలు నిఖిల్‌, పృథ్వీ వెల్లడించారు.    </p>

Buy Now on CodeCanyon