Surprise Me!

పాటలతో గణితం నేర్పిస్తున్న టీచర్ - ప్రశంసించిన మంత్రి లోకేశ్

2025-11-27 13 Dailymotion

<p>Minister Lokesh Praises Teacher who Teaches Maths Through Music: పిల్లల తలరాతను మార్చేది టీచర్లు. పిల్లలకు వినూత్నంగా విద్యను అందించేందుకు ఎంతోమంది ఉపాధ్యాయులు ప్రయత్నిస్తున్నారు. ఈ సమాచారం తన దృష్టికి వచ్చిన వెంటనే మంత్రి లోకేశ్​ వారు చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు బోధించే విధానాన్ని చూసి స్పందిస్తున్న మంత్రి తనదైన రీతిలో ప్రశంసలు కురిపిస్తున్నారు.</p><p>తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలం సావరంలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు నాగేశ్వరరావును మంత్రి నారా లోకేశ్‌ ప్రశంసించారు. గణితాన్ని సంగీతంలా మార్చి సరికొత్తగా పాటల బాణీల్లో పాఠాలు చెబుతూ మాస్టారు నాగేశ్వరరావు ట్రెండ్ సృష్టిస్తున్నారని లోకేశ్‌ కొనియాడారు. ఉపాధ్యాయుడు పాలెపు నాగేశ్వరరావు గ‌ణితానికి సంగీతాన్ని జోడించిన విధానం వినూత్నంగా ఉందని గుర్తు చేశారు. మేథ్స్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసి, విద్యార్థుల‌కు నేర్పించడం ప్రశంసనీయమని అన్నారు. గణితంపై పేరడీ పాటల ద్వారా అవగాహన కల్పిస్తూ, నేర్పిస్తూ, వాటిని సోష‌ల్ మీడియా ద్వారా మ‌రింత ప్రచారం క‌ల్పిస్తోన్న నాగేశ్వర‌రావు మాస్టారికి హృద‌య‌పూర్వక అభినంద‌న‌లు తెలుపుతున్నానని మంత్రి లోకేశ్ అన్నారు.</p>

Buy Now on CodeCanyon