Surprise Me!

IRCTC : Train Ticket Confirmed or Not ? Railways Change Rule | Big Relief for Passengers!

2025-12-18 130 Dailymotion

ప్రయాణికుల రిజర్వేషన్‌ వివరాలతో కూడిన తొలి జాబితాలను రైలు బయల్దేరే సమయానికంటే 10 గంటల ముందే సిద్ధం చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దూర ప్రాంతాల నుంచి వేరే స్టేషన్లకు వెళ్లి రైలును అందుకోవాల్సినవారికి తమ బెర్తు, సీటు ఖాయమైందో లేదో స్పష్టంగా తెలిస్తే చివరిక్షణంలో హైరానా పడాల్సిన అవసరం ఉండదని ఈ ఏర్పాటు చేసినట్లు రైల్వేవర్గాలు చెబుతున్నాయి. తెల్లవారుజామున 5.01 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయల్దేరే రైళ్లకు తొలి చార్టును ముందురోజు రాత్రే రూపొందిస్తారు. మధ్యాహ్నం 2.01 గంటల నుంచి రాత్రి 11.59 గంటల వరకు; అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య బయల్దేరే రైళ్ల తొలిచార్టును ఇదే విధంగా తగినంత ముందుగా సిద్ధం చేస్తారు. ‘ఐఆర్‌సీటీసీ ఈ-వ్యాలెట్ల’లో డబ్బు జమ చేసుకున్నవారు దానిని టికెట్ల కొనుగోలుకే వాడాలని, ఉపసంహరణకు వీల్లేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈ-వ్యాలెట్‌ ఖాతాను మూసివేసినప్పుడే దానిలో మిగిలిపోయిన డబ్బును వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదలాయిస్తామని చెప్పారు.

Indian Railways has decided to prepare the first reservation chart 10 hours before train departure to reduce last-minute confusion for passengers. The Railway Minister also clarified rules related to IRCTC e-wallet usage.

#IndianRailways #RailwayNews #IRCTC #TrainUpdates #ReservationChart #RailwayRules #RailwayInformation #TravelNews #IndiaNews

Also Read

మాజీ ISI చీఫ్ ఫైజ్ హమీద్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష :: https://telugu.oneindia.com/news/international/former-isi-chief-faiz-hameed-sentenced-to-14-years-by-pakistan-military-court-463853.html?ref=DMDesc

ఆస్పత్రిపై వైమానిక దాడి: 31 మంది దుర్మరణం :: https://telugu.oneindia.com/news/international/31-killed-in-airstrike-on-hospital-in-myanmar-rakhine-state-463825.html?ref=DMDesc

గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం: థాయ్‌లాండ్‌లో లూథ్రా బ్రదర్స్ అరెస్ట్ :: https://telugu.oneindia.com/news/india/luthra-brothers-arrested-in-thailand-in-goa-nightclub-fire-case-463803.html?ref=DMDesc

Buy Now on CodeCanyon