Surprise Me!

ఐదేళ్లలో 20 వేల అంకుర పరిశ్రమలు - లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం: RTIH​ సీఈవో ధాత్రిరెడ్డి

2025-12-20 3 Dailymotion

<p>Ratan Tata Innovation Hub CEO Dhatri Reddy: రాష్ట్రంలోని యువతను దృష్టిలో పెట్టుకుని కూటమి సర్కార్​ పలు రంగాలలో వారి అభివృద్ధి కోసం వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. వారి ఉద్యోగావకాశాల కోసం రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తోంది. దానిలో భాగంగానే రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌కు శ్రీకారం చుట్టింది. యువ ఆవిష్కరణల వేదికగా రాష్ట్ర ఆర్థికవృద్ధిలో ప్రతి కుటుంబానికీ భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇది దేశానికే కాదు ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్‌ల కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని సంస్థ సీఈవో ధాత్రిరెడ్డి తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఇరవై వేల అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేసి లక్ష ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. విద్యాసంస్థలతో సంబంధం లేకుండా ఏదైనా ఆవిష్కరణలు చేసిన వారికి మరింత ప్రోత్సాహిస్తామన్నారు. ఈ హబ్​ గురించి మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే విందాం. </p>

Buy Now on CodeCanyon