Surprise Me!

లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలో MPL4 క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభం

2025-12-21 5 Dailymotion

<p>Mangalagiri Premier League 4 2025:  ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలో ఏర్పాటుచేసిన MPL4 క్రికెట్ లీగ్ పోటీలను నారా బ్రాహ్మణి, ఎంపీ సానా సతీశ్, సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రారంభించారు. నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా గత నాలుగేళ్లుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఏడాది అత్యధికంగా దాదాపు 125 టీంలు పోటీలో పాల్గొంటున్నాయి. ఈనెల 21 నుంచి జనవరి 21 వరకు పోటీలను నిర్వహించనున్నారు.</p><p>క్రికెట్ ఆడిన నారా బ్రాహ్మణి, హీరో నిఖిల్: విజేతలకు దాదాపు పదిలక్షల విలువైన బహుమతులను అందజేయనున్నారు. పోటీలలో మొదటి మ్యాచ్​ను నారా బ్రాహ్మణి టాస్ వేసి ప్రారంభించారు. క్రీడాకారులతో నారా బ్రాహ్మణి కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఏర్పాటుచేసిన చిత్ర ప్రదర్శనను నారా బ్రాహ్మణి తిలకించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు మంత్రి నారా లోకేశ్ కృషి చేస్తున్నారని ఎంపీ సానా సతీశ్ చెప్పారు. లోకేశ్ కృషితో మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు.</p><p>"క్రీడలను ప్రోత్సహించేందుకు మంత్రి నారా లోకేశ్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. విజేతలకు దాదాపు పదిలక్షల విలువైన బహుమతులను అందజేయనున్నారు. నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా గత నాలుగేళ్లుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నాం"-సానా సతీశ్,ఎంపీ </p><p>"మంత్రి లోకేశ్ కృషితో మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్‌' అవార్డు ఎంతో సంతోషం. చంద్రబాబు, పవన్, లోకేశ్ విజన్​తో రాష్ట్రం భవిష్యత్తులో అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుందని ఆశిస్తున్నా"-నిఖిల్ సిద్ధార్థ్, సినీ హీరో</p>

Buy Now on CodeCanyon