Surprise Me!

షార్ట్‌సర్కూట్‌తో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధం - ఖమ్మం నుంచి విశాఖ వెళ్తుండగా ఘటన

2026-01-07 4 Dailymotion

<p>Fire Accident to Private Travel Bus Near Kovvur of East Godavari District : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అగ్నికి ఆహుతైంది. సెల్ఫ్‌ మోటార్‌లో షార్ట్ సర్కూట్ కారణంగా త్రిపుల్‌ ఆర్‌ ట్రావెల్స్‌ బస్సు పూర్తిగా కాలిపోయింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరగ్గా బస్సులో ఉన్న 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఖమ్మం నుంచి విశాఖకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్‌ అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. మొత్తం ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది తమ వస్తువులను తీసుకుని దూరంగా వెళ్లారు. బస్సు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ప్రయాణికులను మరొక బస్సులో కొవ్వూరు నుంచి తరలించారు. బస్సు ప్రమాదంతో ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.</p>

Buy Now on CodeCanyon