Surprise Me!

సాఫ్ట్​వేర్​ సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

2026-01-08 15 Dailymotion

<p>Sritech Software Services Pre-Sankranti Celebrations : సంక్రాంతి వచ్చేస్తోంది. రాష్ట్రంలోని ముందస్తు పండుగ సంబరాలు మొదలయ్యాయి. హైదరాబాద్​లో పలు సాఫ్ట్​వేర్ సంస్థలు ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఇలాగే మధురానగర్​లోని శ్రీటెక్​ సాఫ్ట్​వేర్​ సర్వీసెస్​ కంపెనీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉద్యోగులు, వారి పిల్లల కోసం నిర్వహించిన రంగోలి పోటీలు ఆద్యంతం ఉత్సాహభరితంగా జరిగాయి. ఉద్యోగులంతా ముగ్గులు వేసి ఆటపాటలతో సందడి చేశారు. సాంస్కృతిక, వినోద కార్యక్రమాలతో ఈ వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి. </p><p>సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా, ముచ్చట గొలిపేలా ముగ్గుల అలంకరణలో విద్యార్థినులు, ఉద్యోగులు పోటీ పడ్డారు. అనంతరం భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. ఈ సంక్రాంతి వేడుకల సందర్భంగా టెక్నాలజీస్​ విత్​ ట్రెడిషన్​ అనే ఆలోచనతో ఐటీ రంగంలో పరిచయం చేసినట్లు సంస్థ​ సీఈఓ నరేశ్​ బుడవతి తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా మహిళలకు అవకాశాలు కల్పించడం, వారి ప్రతిభను ప్రోత్సహించడం సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. </p>

Buy Now on CodeCanyon