Surprise Me!

జమ్మలమడుగులో వాలీబాల్ పోటీలు - సరదాగా ఆడిన మంత్రి సవిత

2026-01-08 6 Dailymotion

<p>The Volleyball Tournament: కడప జిల్లా జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానంలో మూడో రోజు జాతీయస్థాయి బాలికల వాలీబాల్ పోటీలు పోటా పోటీగా సాగాయి. పోటీల సందర్భంగా బుధవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడితో కలసి కడప జిల్లా ఇంచార్జ్ మంత్రి సవిత హాజరై వాలీబాల్ ఆడి సందడి చేశారు. మంత్రి సవితకు క్రీడాకారిణిలు ఘనంగా స్వాగతం పలికారు.</p><p>మంత్రి సవిత ముందుగా క్రీడాకారిణులను పరిచయం చేసుకుని రాజస్థాన్ క్రీడాకారులతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడారు. స్టేజి ఎదురుగా ఏర్పాటు చేసిన క్యాంపు ఫైర్​ను వెలిగించారు. కూటమి ప్రభుత్వం విద్యతో సమానంగా క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సవిత కొనియాడారు. జమ్మలమడుగులో ఇంత ఘనంగా వాలీబాల్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఎల్లవేళలా అభివృద్ధి, సంక్షేమం, పథకాలు, పరిశ్రమలతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతను ఇవ్వడం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యమని తెలిపారు.</p><p>మన క్రీడాకారులు క్రికెటర్ శ్రీచరణిలా అంతర్జాతీయ స్థాయిలో ఆడి రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు ఫైర్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. మణిపూర్ కళాకారులు కత్తులపై పడుకోవడం, గాజు గ్లాసులపై నిలబడి బంతులను మార్చుకోవడం వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోటీలకు హాజరైన క్రీడాకారిణుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముందుగా హిమాచల్ ప్రదేశ్ జట్టు చేసిన డ్యాన్స్​ను అందరినీ ఆకట్టుకుంది. </p>

Buy Now on CodeCanyon