<p>Minister Savitha Interaction In RTC Bus at Sri Sathyasai District : మంత్రి సవిత ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలతో ప్రయాణించి, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్ద గువ్వలపల్లిలో నూతనంగా నిర్మించిన రోడ్డును సవిత ప్రారంభించారు. అనంతరం అటువైపు వెళుతున్న ఆర్టీసీ బస్సులో కొద్దిసేపు ప్రయాణిస్తూ మహిళలతో మంత్రి ముచ్చటించారు. ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయని మహిళలను ఆరా తీశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల చాట్స్‌లో ఇచ్చిన హామీల్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా ప్రారంభించామని మంత్రి సవిత అన్నారు. చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అని మంత్రి సవిత తెలిపారు. మహిళల అభివృద్ధికి, సాధికారతకు పెద్దపీట వేస్తూ పెద్దన్నల చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారని మంత్రి అన్నారు. ఉచిత బస్సుల వల్ల మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎక్కడికైనా ధైర్యంగా ప్రయాణిస్తున్నారని మంత్రి తెలిపారు. </p>
