Surprise Me!

ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి - ఆకట్టుకున్న పొట్టేళ్ల పోటీలు

2026-01-12 9 Dailymotion

<p>Sankranti Special Pottelu Competition At krishna District :  రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ చూసినా పండగ వాతావరణం కనిపిస్తోంది. ప్రజలంతా వివిధ రకాల పోటీలతో సరదాగా గడుపుతున్నారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో జాతీయస్థాయి పొట్టేళ్ల పోటీలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా నుంచి పొట్టేళ్లను పోటీలకు తీసుకువచ్చారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా రెండు రోజుల పాటు పోటీలను నిర్వహిస్తున్నారు. పొట్టేళ్ల పోటీలు తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు. వాళ్ల కేరింతలతో ప్రాగణం అంతా మారుమ్రోగింది. కేవలం పొట్టేళ్లే కాకుండా, ఎద్దులు, కోడి పందేలు సైతం జోరుగా సాగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా  సంక్రాంతి పండగను పురస్కరించుకుని యువతులు ఉత్సాహంగా రంగవల్లుల పోటీల్లో పాల్గొన్నారు. గంగిరెద్దులు మేళతాళాలతో వచ్చినట్లు, లక్కపిడతలను అమర్చినట్లు, తెలుగుదనం ఉట్టిపేలా రంగుల ముగ్గులు వేస్తున్నారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ బహుమతులు ఇచ్చారు.</p>

Buy Now on CodeCanyon