<p>Godarolla Sankranthi Celebrations in London: విదేశాల్లో తెలుగు ప్రజలు కొద్దిరోజుల ముందు నుంచే సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్నారు. లండన్‌లో ఘనంగా గోదారోళ్ల సంక్రాంతి వేడుకలు – 2026 ఘనంగా నిర్వహించారు. బ్రిటన్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచే గోదారోళ్ల సంక్రాంతి వేడుకలు కేరింతల మధ్య సరదాగా సాగాయి. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తెలుగు కుటుంబాలు హాజరయ్యారు.</p><p>ఈ కార్యక్రమంలో సంక్రాంతి పండుగ ప్రత్యేకతను చాటేలా భోగి మంటలు, ముగ్గులపోటీలు, హరిదాసుల కీర్తనలు, గొబ్బెమ్మల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు సంప్రదాయ చీరల్లో, పురుషులు పంచెకట్టుతో హాజరయ్యారు. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారుల నుంచి పెద్దల వరకు నిర్వహించిన సినీపాటల నృత్యాలు, కూచిపూడి నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు సంక్రాంతి సంబరాలను ఉద్దేశించి మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న మన తెలుగు సంప్రదాయాలు, పండుగలను పిల్లలకు పరిచయం చేయడమే గోదారోళ్ల సంక్రాంతి ప్రధాన లక్ష్యమని వారంతా వెల్లడించారు. </p>
