<p>Bhogi Celebrations At AU Grounds : తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ వెల్లువెత్తుతోంది. వైభవంగా జరుపుకునే మూడు రోజుల పండగలో మొదటి రోజు భోగి మంటలతో పండుగకు స్వాగతం పలికారు. రంగవల్లులు, హరిదాసు కీర్తనలతో తెలుగు ముంగిళ్లు కళకళలాడుతున్నాయి. విశాఖలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలందరూ ఇళ్ల ముందు భోగి మంటలు వేసి, ఎంతో వైభవంగా చేసుకున్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా, పండగను ఘనంగా నిర్వహించారు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. న్యత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో విశాఖ వాసులు భోగి వేడుకలు చేసుకున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భోగిమంటలు వేసి కోలాటాలు ఆడుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆవు పేడతో చేసిన పిడకలు, తాటాకులు, చెట్ల కర్రలతో వేసే భోగి మంటలతో బద్ధకంతో పాటు మదిలోని నిరాశానిస్పృహలనూ వదిలిస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. చక్కటి ఆనందాన్ని పంచే ఎన్నో మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు. భోగి పండుగ సందడిపై మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. </p>
