<p>Foreigners Visited Cockfights in NTR District: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందేలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశీయులు సైతం తరలివచ్చారు. నందిగామ మండలం కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కోడి పందేలను తిలకించిన విదేశీయులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోడిపందేలు చూడటం కొత్తగా ఉందని అన్నారు. రెండు కోళ్లు కొట్టుకోవడం షాక్‌కు గురి చేసిందని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక్కడ నిర్వహిస్తున్న సంక్రాంతి కోడిపందేలు తమకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. </p><p>పందెంరాయుళ్ల కోసం యూపీఐ పేమెంట్, స్కానర్లు, క్యాష్ మిషన్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. కోడి పందేల బరుల వద్ద ఆకర్షణీయమైన బహుమతులు పెట్టారు. వరుసగా ఐదారు పందేలు గెలిచిన వారికి బైకులను గిఫ్ట్ గా ఇచ్చారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో కోడిపందేలు జాతరను తలపించాయి. విజయవాడ శివారు ప్రాంతాల్లో గోదావరి జిల్లాలను తలదన్నేలా కోడి పందేలను నిర్వహిస్తున్నారు.</p><p>"కోడిపందేలు చూడటం ఎంతో కొత్తగా ఉంది. ఒక రెండు కోళ్లు కొట్టుకోవడం మమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇక్కడ నిర్వహిస్తున్న సంక్రాంతి కోడిపందేలు మాకు ఓ సరికొత్త అనుభూతిని కలిగించాయి" -విదేశీయులు </p>
