<p>Boat Race Competitions in Prakasam District: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు తీరంలో పడవ పోటీలు జరిగాయి. సముద్రంలోని పడవ పోటీలు ఎంతో కన్నుల పండువగా జరిగాయి. ఈ కార్యక్రమం మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో మత్స్యకారులకు పడవల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చాపల వంశీకృష్ణ ప్రారంభించారు. </p><p>కోలాహలంగా సాగిన పడవ పోటీలు: పోటీలకు మొత్తం 14 పడవల్లో మత్స్యకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారు సముద్రంలో 500 మీటర్లు దూరంలో ఉన్న జెండాను తీసుకొని తీరం వద్దకు రావాల్సి ఉంటుంది. అందుకుగాను మూడు బహుమతులు పెట్టారు. మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ పడవ పోటీలు కోలాహలంగా సాగాయి. మొదటి బహుమతిగా రూ.15,000, రెండవ బహుమతిగా రూ.10,000, మూడవ బహుమతిగా రూ.5,000 నిర్ణయించారు. విజయం సాధించిన వారికి డాక్టర్ వంశీకృష్ణ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. </p>
