<p>Cockfighting Telangana And Andhra Border Areas : సంక్రాంతి పండగ సంబరాల వేళ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలోని పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా మధిర ఉండటంతో ఆయా సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలు పందేలను తిలకించేందుకు భారీగా తరలివచ్చారు. అలాగే సమీపాన ఉన్న ఎన్టీఆర్ జిల్లా నుంచి పందేలు చూసేందుకు పెద్దఎత్తున జనాలు వచ్చారు. కోళ్ల పందేలతో పాటు జూదం, గుండాట వంటి క్రీడలు ఆడేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ సందర్భంగా వేల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఆరు నెలల పాటు బలవర్థకమైన ఆహారం పెట్టి పోషించి నమ్మకంలో బరిలో నిలపుతుండగా ప్రత్యర్థిపై కోళ్లు కత్తులు దూస్తున్నాయి. యమా రంజుగా సాగిన పోరాటంలో విజేతగా నిలుస్తున్నాయి. కోడి పందేలను చూసేందుకు జనాలు బారులు తీరారు. ఆసక్తిగా తిలకిస్తూ వేల రూపాయలను ఆర్జిస్తున్నారు.</p>
