<p>Minister satyakumar Dance in Sankranti Celebrations At Dharmavaram: 'ఏందీ వెంకీ సంగతి - అద్దిరిపోద్ది సంక్రాంతి' అనే పాట ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మారుమోగుతోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ ఈ పాటకు చిందేస్తుండటం గమనార్హం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సంక్రాంతి వేడుకలకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే అక్కడితోనే ఆగకుండా అందరినీ హుషారెత్తించేలా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. దాంతో స్థానికులతో కలిసి వేదికపై కొద్దిసేపు చిరంజీవి నటించిన మన శివశంకరవరప్రసాద్ గారు చిత్రంలోని 'ఏందీ వెంకీ సంగతి అద్దిరిపోద్ది సంక్రాంతి' పాటకు కాలు కదిపారు. స్టెప్పులు వేస్తూ అందరిని అలరించారు. సంక్రాంతి పండుగ సంబరాలు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకు రావాలని మంత్రి సత్యకుమార్ ఈ సందర్భంగా కొనియాడారు. అందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. కూటమి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. </p>
