Surprise Me!

తిరుపతిలో 'అనగనగా ఒక రాజు' సినిమా బృందం సందడి

2026-01-20 6 Dailymotion

<p>Anaganaga Oka Raju Movie : సంక్రాంతి పండగకు రిలీజైన తెలుగు సినిమాలు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. పాన్ఇండియా స్టార్ రాజాసాబ్​తో మొదలైన పొంగల్ బాక్సాఫీస్ సందడి మెగాస్టార్​ చిరంజీవి మన శంకరవరప్రసాద్​ గారు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్​ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజుతో కొనసాగుతోంది. నేటి యువ కథానాయకుల్లో వినోదానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు నవీన్‌ పొలిశెట్టి. ఈ సంక్రాంతికి అలాంటి వినోదాన్ని పంచడానికి ‘అనగనగా ఒక రాజు’  అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.</p><p>తాజాగా విడుదలైన 'అనగనగా ఒక రాజు' సినిమా బృందం తిరుపతిలో సందడి చేసింది. సినీ నటుడు నవీన్‍ పొలిశెట్టి, సినీ నటి మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో నటించారు. తిరుపతి నగరంలోని సంధ్యా థియేటర్‌కి నటుడు నవీన్, నటి మీనాక్షి​ వచ్చారు. చిత్రంలో ఉన్న డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను ఉత్సహపరిచారు. సినిమాను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతిలో తమ చిత్రానికి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ ఉందని, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ దాటిందని నటుడు నవీన్ పొలిశెట్టి అన్నారు.</p>

Buy Now on CodeCanyon