<p>Bike Theft Near Police Station in Uravakonda in Anantapur District: దొంగతనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేటుగాళ్లు తమ చేతివాటానికి పని చెబుతున్నారు. ఇందుకోసం వారు కొత్త ఐడియాలతో తమ పని చేసుకుపోతున్నారు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఉన్న బైక్‌నే ఓ దుండగుడు అపహరించాడు. ఎవరూ చూడడం లేదు కదా అని అనుకున్నాడు. తీరా సీసీ టీవీ ఫుటేజ్‌లో దృశ్యాలు అన్ని రికార్డు అయ్యాయి. </p><p>అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న స్వాతి కాంప్లెక్స్ పక్కన ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యాసాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జనవరి 15వ తేదీన ఓ దుకాణంలో పెయింట్ కొనేందుకు వచ్చి తన బైక్‌ను పార్కింగ్ చేసి లోపలికి వెళ్లాడు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగుడు బైక్‌ను తీసుకెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. వెంటనే బాధితుడు ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి.</p>
