Surprise Me!

ల్యాండింగ్‌కు కొద్ది సెకన్ల ముందే ఘోరం.. దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు! Ajit Pawar Flight Incident

2026-01-28 8 Dailymotion

Ajit Pawar Flight Incident: Old Crash History of Learjet 45 Sparks Safety Debate
అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం (Learjet 45) గతంలోనూ ప్రమాదానికి గురైంది. 2023 సెప్టెంబర్‌లో ముంబైలో జరిగిన ఆ ప్రమాదం, నేటి ఘోర దుర్ఘటన వెనుక ఉన్న కారణాలపై ప్రత్యేక కథనం. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం గురించి విస్తుగొలిపే నిజం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం బారామతిలో ప్రమాదానికి గురైన అదే ప్రైవేట్ విమానం (Learjet 45, రిజిస్ట్రేషన్: VT-SSK), గతంలో 2023లో కూడా ఒకసారి ప్రమాదానికి గురైంది.

సెప్టెంబర్ 2023లో ముంబై విమానాశ్రయంలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఈ విమానం రన్‌వేపై నుంచి పక్కకు దూసుకెళ్లి అదుపుతప్పి పడిపోయింది. ఆ సమయంలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ.. పెను ప్రమాదం తప్పింది. అప్పట్లో విమానంలో ఉన్న ఎనిమిది మంది (6 ప్రయాణికులు, 2 సిబ్బంది) తీవ్రంగా గాయపడ్డారు, కానీ ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత మరమ్మతులు చేసి దానిని తిరిగి సర్వీసులోకి తీసుకొచ్చారు. అదే విమానంలో నేడు (జనవరి 28, 2026) అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి ప్రయాణించారు. ఉదయం 8:45 గంటల సమయంలో బారామతి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. అదే విమానం అజిత్ పవార్ ప్రాణాలను బలితీసుకోవడం గమనార్హం.

Ajit pawar plane crash, The Learjet 45 (VT-SSK) that crashed ki*ling Ajit Pawar had a prior a*cident in Sep 2023 at Mumbai airport. Read about the aircraft's history and DGCA's investigation.

#AjitPawar #BaramatiIncident #Learjet45 #VTSSK #DGCAProbe #AviationNews #PrivateJet #IndiaBreaking #AircraftSafety #MaharashtraNews

~HT.286~PR.38~

Buy Now on CodeCanyon