1996లో మొట్టమొదట నేను తెలుగు కంప్యూటర్ మేగజైన్ రూపొందించేటప్పుడు మేగజైన్ వర్క్ కొద్దిగా లీజర్ దొరికితే Dave గేమ్ తో పాటు మరో గేమ్ ఏదో గుర్తులేదు.. దాన్నీ ఎక్కువ ఆడుతూ ఉండేవాడిని. ఆయా డాస్ గేమ్ లు పూర్తిగా రియల్ మోడ్ DOS ఆధారంగా మాత్రమే పనిచేసేవి. తాజా విండోస్ Vista, 7 వంటి ఆపరేటింగ్ సిస్టమ్ లలో నేరుగా వాటిని రన్ చేయడానికి వీలుపడదు. అలాగని వదిలేసుకోవలసిన అవసరమూ లేదు. రియల్ DOS ఎన్విరాన్ మెంట్ లో మాత్రమే పనిచేసే Dave వంటి గేమ్స్, Wordstar వంటి వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్ వేర్లని Windows 7 వంటి తాజా ఆపరేటింగ్ సిస్టమ్ లలో సౌండ్ తో సహా ఎలా ఆడుకోవచ్చో ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine nallamothu sridhar