మన పిసిలో అమర్చబడి ఉన్న ప్రాసెసర్, RAM, గ్రాఫిక్ కార్డ్, హార్డ్ డిస్క్ ల పూర్తి కెపాసిటీల ఆధారంగా మన కంప్యూటర్ కి ఓ ర్యాంక్ ఇవ్వబడుతుంది. దీన్నే "సిస్టమ్ రేటింగ్" అని పిలుస్తారనుకోండి, అది వేరే విషయం! ఈ సిస్టమ్ రేటింగ్ ని బట్టి మనది ఏ స్థాయి కంప్యూటరో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ రేటింగ్ ని బట్టే మీ కంప్యూటర్లో ఎలాంటి సాఫ్ట్ వేర్లు, గేమ్ లూ సరిగా రన్ అవుతాయీ లేదూ అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ నేపధ్యంలో అసలు మీ కంప్యూటర్ యొక్క సిస్టమ్ రేటింగ్ ని ఎలా తెలుసుకోవాలీ, ఆ రేటింగ్ లను ఇచ్చే టెస్ట్ లను ఎంత ఈజీగా చేయవచ్చో ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine